తెలంగాణ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ‘రాష్ట్రంలో ఒకే కుటుంబ పాలన ఉంది. ఉద్యోగులకు జీతాలు లేవు. రాష్ట్రంలో ప్రతిఒక్కరిపై రూ.1.27లక్షల అప్పు ఉంది. టీఆర్ఎస్ ఎంఐఎంతో ఎందుకు తిరుగుతుందో సీఎం కేసీఆర్ చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేసీఆర్, కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ లు రాష్ట్రం కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.