ఏపీ: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి అన్నారు. వివేక వర్ధంతి సందర్బంగా మాట్లాడిన ఆమె ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలన్నారు. ‘కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు తెలుసు. హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్నందునే వారిపై సీబీఐకి అన్ని విషయాలు చెప్పా. హత్య చేసిన వారిని ఎలా వదిలిపెట్టగలను?’ అని వ్యాఖ్యానించారు.