మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో చెప్పలేం. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా కిందపడి మృతి చెందాడు. ఈ బాధాకర ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో జరిగింది. అయితే అతను నడిచిన ప్రాంతంలో రికార్డైన సీసీ ఫుటేజ్ ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వారు షాక్ అవుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు అతడిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు కారణంగా అతను మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.