రష్యాలోని ఓ సిటీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బటైస్క్ ప్రాంతంలో ఓ మహిళ చనిపోయింది. కానీ ఎవరూ కూడా ఆ మహిళ శవాన్ని చాలా రోజుల పాటు చూడకపోవడంతో ఆ లేడీ పెంచుకున్న పిల్లులే ఆమె శవాన్ని తిన్నాయట. 2 వారాల తర్వాత గుర్తించిన స్థానికులు పోలీసులకు చెప్పడంతో అక్కడికి పోలీసులు వెళ్లగా.. అప్పటికే మహిళ శరీరంలో చాలా భాగాలను పిల్లులు తినేసి ఉన్నాయి. మిగిలిన పార్ట్స్ కలెక్ట్ చేసుకున్న పోలీసులు ఆ పెంపుడు పిల్లుల్ని ఎవరికైనా ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ఆ పిల్లుల్ని పెంచుకునేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు.