ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం నాటికి క్రూడ్ ఆయిల్ ధరలు 125డాలర్లకు చేరాయి. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోలు ధరల పెంపుపై నిర్ణయం వెలువడనున్నట్లు అంచనాలున్నాయి. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి.