ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 118 రోజుల నుంచి ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ జరగలేదు. దీనికి ఐదు రాష్ట్రాల ఎన్నికలే కారణమని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 7తో ఎన్నికలు ముగియనుండడంతో.. పెట్రో ధరలను ఆయిల్ కంపెనీలు తప్పకుండా పెంచుతాయని అంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ధరల పెంపుపై తన అంచనాలను వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిపోయాయి కాబట్టి రూ. 9-10 వరకు పెట్రో బాదుడు ఉంటుందని అంచనా వేసింది. మరి ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.