గత ఆరో రోజుల్లో ఐదోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. నేడు పెట్రోల్‌పై లీటర్‌కు మరో 50 పైసలు, డీజిల్‌కు 55పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు ధరలు నిర్ణయించాయి. దీంతో 5 రోజుల్లో పెట్రోల్ ధరలు రూ.3.70, డీజిల్ ధరలు రూ.3.75కు పెరిగాయి. నేడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37గా ఉంది. డీజిల్ రూ.98.69. గత నాలుగు నెలలకు పైగా స్థిరంగా కొనసాగిన ఇంధన ధరలు మార్చి 22 నుంచి రోజు పెరుగుతున్నాయి.