ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడయిన వెంటనే పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఫలితాలు వెల్లడయి దాదాపు వారం గడుస్తున్నా కేంద్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ శక్తి సింగ్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. రాష్ట్రాల ఎన్నికలతో ఆయిల్ ధరలకు సంబంధం ఉండదని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ అంశం దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఇటీవల భారత్ లో ఆయిల్ ధరలు, కేవలం 5 శాతం పెరిగాయని, అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో దాదాపు 60 శాతం పెరిగాయని గుర్తు చేశారు.