ఇకపై ల్యాప్‌టాప్‌లను కూడా ఫోన్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసే వీలు ఉండనుంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒకే తరహా ఛార్జింగ్ పోర్టును ఏర్పాటు చేయడానికి ఆయా కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాలకు ఒకే రకమైన ‘సీ’ టైప్ పోర్టును అమర్చాలని ప్రతిపాదించగా కంపెనీలు ఒకే చెప్పాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాల వాటా తగ్గనుంది. అయితే, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఒక ఉపకమిటీ ఏర్పాటైంది.
ల్యాప్‌టాప్‌లకు ఫోన్ ఛార్జర్..!

© Envato