పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో దారుణం జరిగింది. జల్పేష్‌కు వెళుతున్న పికప్ వ్యాన్ కరెంట్ షాక్ కు గురై ఆదివారం అర్ధరాత్రి 10 మంది మరణించారు. ఘటన సమయంలో వ్యాన్‌లో 27 మంది ఉండగా, మరో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌లోని డీజే సిస్టమ్‌కు చెందిన జనరేటర్ వైరింగ్ కారణంగా ఇది జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.