ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికుల బస్సు లోయలో పడి 25 మంది ప్రయాణికులు మృతి చెందారు. 19 మందిని బయటకు తీయగా, మరో 5 మృతదేహాలను వెలికితీసేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ మేరకు నిన్న రాత్రి సందర్శించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ తెలిపారు. మరో నలుగురికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మరణించిన ప్రమాద బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున చౌహాన్ పరిహారం ప్రకటించారు. మరోవైపు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.2 లక్షల సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.