ఫ్లోరిడాకు చెందిన ఓ ప్రయాణికుడు సడెన్‌గా విమానం నడిపి హీరోగా మారాడు. అదేలా అంటే.. సెస్నా కారవాన్ ప్లైట్ ఇద్దరి ప్రయాణికులతో ఫ్లోరిడా బయలుదేరింది. ఇంతలో అకస్మాత్తుగా పైలట్ అస్వస్థతకు గురయ్యాడు. ఫ్లైట్ నడపలేనని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం అధికారులకు వెల్లడించాడు. దీంతో కంట్రోల్ రూం నుంచి ఓ అధికారి ఇచ్చిన సూచనల మేరకు ప్రయాణికుడు పైలట్ సీటులో కూర్చున్నాడు. అతడి సూచనల మేరకు సురక్షితంగా విమానాన్ని ఫ్లోరిడాలోని ప్లామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ చేశాడు. పైలట్, తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.