గగనతలంలో ప్రయాణిస్తున్న బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం, శ్రీలంకన్ ఎయిర్‌వేస్ విమానం ఒకదానికొకటి ఢీ కొట్టుకునేంత దగ్గరకు వచ్చాయి. కానీ పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 275 మందితో లండన్ నుంచి లంకకు బయళ్దేరిన విమానం తుర్కియా గగనతంలోకి ప్రవేశించగా.. అదే సమయంలో 250 మంది ప్రయాణికులతో దుబాయ్ వెళ్తున్న బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాన్ని ఢీ కొట్టబోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లెయిన్ క్రాష్ కాకుండా కాపాడిన తమ పైలట్‌పై లంక ప్రభుత్వం ప్రశంసల జల్లు కురిపించింది.