తెలంగాణలో అధికారంలో ఉన్న గులాబీ దళంలో గ్రూపు రాజకీయాలు మొదలయిన విషయం తెలిసిందే. దీనిపై ద్రుష్టి సారించిన అధిష్టానం గ్రూపు రాజకీయాలను రూపుమాపాలని ప్రయత్నాలు చేసింది. అందుకు అసంతృప్త నేతలతో చర్చించేందుకు నిర్ణయించుకుంది. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. తిరిగి అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు నాయకులు. దీంతో పాటు పలువురు నేతలు పార్టీని వీడి వేరే పార్టీల్లో చేరడంతో TRS అధిష్టానంలో ఆదోళనలు మొదలయ్యాయి. స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగినా పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని, కేటీఆర్‌ను గులాబీ నేతలు లైట్ తీసుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.