అధికార పార్టీ టీఆర్ఎస్‌కు గ్రేటర్ లో ఎదురుదెబ్బ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 23 కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఇవాళ రేవంత్ రెడ్డి సమక్షంలో విజయారెడ్డి మీడియాతో మట్లాడారు. గత ఎన్నికల్లో విజయారెడ్డి టీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించగా నిరాశే ఎదురైంది. కార్పొరేటర్ పదవి కోసమూ తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తనకు మంచి భవిష్యత్ ఉంటుందనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు విజయారెడ్డి తెలిపారు.