హైవేలపై రన్‌వేకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 29న విజయవాడ-ఒంగోలు హైవే పై NHAI అధికారులు విమాన ల్యాండింగ్ ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లా రేణింగవరం, కొరిశపాడు మధ్య నిర్మించిన ఎయిర్ప్యాడ్పై విమానాలు దిగనున్నాయి. అత్యవసర సమయాల్లో విమానాలు ల్యాండ్ చేసేందుకు వీలుగా 4 కిలోమీటర్ల మేర ఇక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు ఓ కార్గో విమానం, రెండు ఫైటర్జెట్లు ఇక్కడ దిగుతాయి. ఆ సమయంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.