చంద్రుడిపై నివాసయోగ్యమైన వాతావరణం ఉందా..? లేదా..? అని ఇప్పటివరకు అన్ని దేశాలు పరిశోధనలు జరుపుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన నాసా పరిశోధన సంస్థ ఆశ్యర్యకరమైన విషయాలు వెల్లడించింది. చంద్రుని ధూళితో మొక్కల పెంపకం చేపడుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఆ గ్రహంపై ఆహార పంటలు కూడ పండించే అవకాశం ఉంటుందని పేర్కొంటుంది. నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రునిపై మట్టిని తీసుకురాగా ప్రయోగం చేస్తున్నారు.