టీమిండియా ప్లేయర్లపై మాజీ కోచ్ మదన్‌లాల్ మండిపడ్డాడు. అసలు వారు టీమిండియాకు అడుతున్నట్లు కనిపించడం లేదని మదన్‌లాల్ విరుచుకుపడ్డాడు. ‘టీమిండియాకు ఆడుతున్నామన్న కసి లేదు. జోష్ కనిపించట్లేదు. ఎలాగోలా నెట్టుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇలాగే ఉంటే చాలా ప్రమాదకరం. ఇతర దేశాలు ఫార్మాట్‌కు తగ్గట్టు ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాయి. మరి మనమెందుకలా చేయకూడదు. ఇక ఆటగాళ్లకు విశ్రాంతి కావాల్సి వస్తే ఐపీఎల్ సమయంలోనే దొరుకుతుంది. జాతీయ జట్టు కన్నా ముఖ్యమైంది ఏముంటుంది. లేకపోతే దేశీయ క్రికెట్ మరుగున పడిపోతుంది’ అని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు.