కంగనా రనౌత్ స్వీయ దర్శక నిర్మాణంలో వస్తున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగన నటిస్తోంది. అయితే, అంతా అనుకుంటున్నట్లుగా ఈ సినిమా సులువుగా పూర్తి కాలేదని కంగన చెప్పుకొచ్చింది. సినిమా కోసం తన ఆస్తులు తాకట్టు పెట్టినట్లు స్పష్టం చేసింది. డెంగీ వల్ల ఆరోగ్యం దెబ్బతిందని, అయినా సినిమా చిత్రీకరణలో పాల్గొన్నట్లు నటి గుర్తు చేసుకుంది. ‘నటిగా ఈరోజు ఎమర్జెన్సీ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుత ఘట్టం చివరి దశకు చేరుకుంది’ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కంగన ‘మణికర్ణిక’ సినిమా కూడా దర్శకత్వం వహించారు.