దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ‘హర్ గర్ తిరంగా’ క్యాంపెయిన్ ప్రారంభించారు. అంటే ప్రతి ఒక్కరు ఆగస్ట్ 2 నుంచి 15 వరకు జాతీయ జెండాను తమ సోషల్‌మీడియా ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రధానితో పాటు అమిత్‌షా వారి ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. ఇప్పటికే చాలా మంది మువ్వన్నెల జెండాను తమ సోషల్‌మీడియా ప్రొఫైల్ పిక్చర్‌గా పెడుతున్నారు.