గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లో ఓటు వేయటానికి వచ్చిన ప్రధాని మోదీ తీరుపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ఓటు వేేసేందుకు వచ్చి రోడ్ షో నిర్వహించారని ఆరోపించింది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆక్షేపించింది. ఎన్నికల సంఘం మౌనం పాటించడంపై విమర్శలు చేసింది. గుజరాత్‌లో ప్రభుత్వం, అధికారులు ఏకమయ్యారని ఘాటుగా స్పందించింది. వాహనాలకు భాజపా లోగోలను పెట్టడంతో పాటు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారని నేతలు ఆరోపించారు.