రాజధానిలో పెరిగిన ‘పోక్సో’ కేసులు

© Envato

హైదరాబాద్ లో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లుగా పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్యే దీనికి నిదర్శనం. 2020లో 46 కేసులు నమోదయ్యాయి. 2021లో ఈ సంఖ్య 64కు పెరిగింది. ఈ ఏడాది జూన్ వరకు 48కేసులు పోక్సో చట్టం కింద నమోదవడం గమనార్హం. మరోవైపు లైంగిక నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా నేరాలు తగ్గకపోవడం శోచనీయం. ఇటీవల జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Exit mobile version