మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ బావిని శుభ్రం చేస్తుండగా అందులో విషవాయువు విడుదలై ముగ్గురు సోదరులు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. మొదట ఇద్దరు వ్యక్తులు బావిలోకి ప్రవేశించి తిరిగి బయటకు రాలేదు. దీంతో బావి యజమాని పునీత్ ఖుర్చందేతో పాటు మరో ముగ్గురు ఏమైందోనని దిగారని పోలీసులు పేర్కొన్నారు. ఆ క్రమంలో వారు కూడా విషవాయువు కారణంగా ప్రభావితం అయినట్లు వెల్లడించారు.