పోలవరం ప్రాజెక్టును 2023, జూన్‌లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2005 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు పనుల పురోగతిపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు మంతెన వీఎస్ రాజు, అంగర రామమోహన్, చిక్కల రామచంద్ర రావు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. కుడి, ఎడమ కాలువల పనులు దాదాపు 78.12 శాతం పూర్తయ్యాయని పేర్కొంది. అలాగే ప్రాజెక్టు కోసం 1,12,767.98 ఎకరాల భూసేకరణ చేయగా, పునారావాసులకు 12,278 ఇళ్లు కట్టించామని వివరించారు. మరో 5,440 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు.