గుజరాత్‌లో నకిలీ ఐపీఎల్

© File Photo

ఐపీఎల్ మాదిరిగా ఉండేలా అచ్చంగా సెటప్ చేసి రష్యా పంటర్లను మోసం చేసేందుకు వేసిన స్కెచ్ ను పోలీసులు బయటపెట్టారు. సేమ్ టూ సేమ్ ఐపీఎల్ మాదిరిగా ఉండేలా అక్కడ ఉన్న కూలీలకు డబ్బులిచ్చి వారితో ఐపీఎల్ టీమ్స్ జెర్సీలు ధరింపజేసి ఆడించేవారు. అక్కడ జరిగిన మ్యాచును యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. స్కోరు బోర్డును గ్రాఫిక్స్ లో యాడ్ చేసేవారు. అచ్చం మ్యాచును తలపించేలా ఉండేందుకు ఎంపైర్లకు బొమ్మ వాకీటాకీలను కూడా అందజేశారు. అంతే కాకుండా ప్రఖ్యాత వ్యాఖ్యాత హర్షా బోగ్లేలా మాట్లాడే ఓ వ్యక్తిని కూడా అరేంజ్ చేసుకున్నారు. లీగ్ స్టేజ్ మొత్తం గుట్టుగా సాగిన ఈ తతంగం క్వార్టర్స్ సమయంలో బయటపడింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Exit mobile version