హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కీలక సూత్రధారి అయిన లక్ష్మిపతి పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు 3 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. కాగా, ఈ రోజు ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్స్ కు బలయ్యాడు. హైదరాబాద్ లో డ్రగ్స్ వల్ల మరణించిన తొలి కేసు ఇదే కావడం విశేషం. ఈ దందాను రెండు గ్యాంగులు నడుపుతున్నారు. ఈ రెండు గ్యాంగులలో ఒక గ్యాంగు చెందిన ప్రేమ్ ఉపాధ్ అనే వ్యక్తిని ఇటీవల అరెస్టు చేశారు. ఈ రోజు చనిపోయిన విద్యార్థి ఈ ప్రేమ్ కు స్నేహితుడని పోలీసులు పేర్కొన్నారు.