హైదరాబాద్‌లో పోలీస్ లైసెన్స్‌ను పునరుద్ధరించారు. ఇకపై వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, అగ్నిమాపక ఎన్ఓసీతో పాటు పోలీస్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 2014లో పోలీస్ లైసెన్స్ విధానాన్ని రద్దు చేసిన అధికారులు తొమ్మిదేళ్ల తర్వాత పునరుద్ధరించారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, టీ, కాఫీ షాపులు, ఐస్ క్రీం పార్లర్స్, స్వీట్, జ్యూస్ షాపులు పోలీస్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫైర్ క్రాకర్స్, పెట్రోల్ ఉత్పత్తుల దుకాణాలు పోలీస్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారాన్ని బట్టి రూ.1000-రూ.15000 వరకు లైసెన్స్ ఫీజు ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్స్ జారీ చేస్తున్నారు. Hyderabadpolice వెబ్సైట్ నుంచి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.