మార్చి 12 నుంచి పోలీస్ ఉద్యోగాలకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్ నియామక బోర్డు తెలిపింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఎస్ఐ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 23న తుది పరీక్ష నిర్వహిస్తారు. ప్రత్యేక విభాగాలకు సంబంధించిన పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా గర్భిణుల కోసం ఫిజికల్ ఈవెంట్స్ ఎత్తివేసింది. వారు మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ తర్వాత నెల రోజుల్లోపు ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.