ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయ్యన్య పాత్రుడు ఇంటిని ఆదివారం ఉదయం పోలీసులు చుట్టుముట్టారు. మున్సిపల్ సిబ్బంది నర్సీపట్నంలోని ఆయన ఇంటి గోడను అర్థరాత్రి కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించినందున కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మున్సిపల్ కమీషనర్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఇళ్లు నిర్మించామని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.