గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో గంటపాటు ప్రజలు బయటకి రావొద్దని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరుతోందని ….దానివల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. గంట తర్వాత తమ ప్రయాణాలు మొదలు పెట్టాలని హైదరాబాద్ సీపీ సూచించారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.