ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ తాము ఉక్రెయిన్ దేశానికి యుద్ధ విమానాలను అందజేస్తామని పోలండ్ దేశం సంచలన ప్రకటన చేసింది. పోలండ్ ప్రకటనతో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జర్మనీలోని అమెరికా వాయుసేన స్థావరం ద్వారా మిగ్-29 యుద్ధ విమానాలను అందుబాటులో ఉంచుతామని పోలండ్ ప్రధాని మ్యాథ్యూస్ మోరావీకీ ప్రకటించారు. ఇక తుది నిర్ణయం తీసుకునే హక్కు అమెరికా, నాటో చేతుల్లోనే ఉందని తెలిపారు. పోలండ్ ప్రకటనతో రష్యా అలర్ట్ అయింది. ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.