తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 75 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. భారీ భద్రత నడుమ బ్యలెట్ బాక్సులను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియానికి తరలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 16 ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.