నేడే పాలీసెట్ పరీక్ష

© File Photo

పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ పరీక్ష నేడు తెలంగాణాలో నిర్వహించనున్నారు. నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహం 1.30గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం 365 పరీక్షా కేంద్రాలలో.. 1,13,974 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించనుండగా.. 11 దాటిన తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version