మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో పొంగులేటి రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాను ఏ పార్టీలోకి వెళ్లాలో సూచించాలని పొంగులేటి కార్యకర్తలను కోరినట్లు తెలుస్తోంది. దీనికి వారు బీజేపీలోకి వెళ్లాలని చెప్పినట్లుగా సమాచారం. కాగా పొంగులేటి కొద్దికాలంగా బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కూడా ఆయన హాజరు కాలేదు.