F3 ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే.. భారీ డిమాండ్

Courtesy Instagram:

ప్ర‌స్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. ఈ బ్యూటీ సౌత్ లోని అంద‌రు స్టార్ హీరోల‌తో ఛాన్స్ ద‌క్కించుకొని బిజీ హీరోయిన్ గా మారింది. ఆమె తాజాగా న‌టించిన బీస్ట్ సినిమా ఏప్రిల్ 13 విడుద‌ల కాబోతోంది. ఇక‌, తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం.. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కుతున్న F3 సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతోంద‌ట‌. ఇందుకోసం ఈ అమ్మ‌డు నిర్మాత‌ల‌ను ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. అయితే, నిర్మాత‌లు ఆమెకు న‌చ్చ‌జెప్పి రూ.కోటికి ఒప్పించినట్లు స‌మాచారం. కాగా, పూజా ఇంత‌కుముందు రంగ‌స్థ‌లం లో ఓ ఐటెం సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version