సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను కథానాయికగా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం పూజ ఉన్న బిజీ షెడ్యూల్‌తో మహేశ్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందట. దీని కారణంగా షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమన్, మహేశ్, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.