పూజా హెగ్డే ‘ముకుంద’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక్కడ రెండు సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. కానీ అక్కడ వరుసగా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఎటువంటి ఆఫర్స్ రాక ఏడాది పాటు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. కానీ ఆ సమయంలో ఏం బాధపడలేదు. తాను ఎంచుకుంటున్న కథలు సరిగ్గా లేవని అర్థం చేసుకున్నట్లు పేర్కొంది. మళ్లీ తెలుగు సినిమాల హిట్‌తోనే తన కెరీర్ పుంజుకుందని చెప్పింది. ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో 2 సినిమాలు చేస్తుంది. బాలీవుడ్‌లోనూ కొత్త ప్రాజెక్టులకు సంతకం చేసింది. రణ్వీర్ సింగ్‌తో సర్కస్, సల్మాన్ ఖాన్‌తో కబీ ఈద్.. కబీ దివాళి చిత్రాల్లో నటిస్తుంది.