కాంగ్రెస్ నుంచి ఈ ఏడాది భాజపాలో చేరిన వారికి కీలక పదవులు వరించాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, సీనియర్ నేత సునీల్ జాఖడ్ ను జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. భాజపాలో చేరిన రోజే జైవీర్ కు బాధ్యతలు అప్పగించారు. సుప్రీంకోర్టు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న షెర్గిల్..హస్తం పార్టీకి రాజీనామా చేశారు. నిన్న కమలం తీర్థం పుచ్చుకోగా..తొలి రోజే కీలక పదవి దక్కింది.