చిన్న సినిమాగా తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్లు సాధిస్తుంది. కశ్మీర్లో 1990లో తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో లక్షలాది మంది హిందూ పండిట్స్పై జరిగిన అఘాయిత్యాలను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇందులో చూపించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్, మంచి రివ్యూలు రావడంతో బాలీవుడ్లో హౌస్‌పుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. చిత్రబృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసించారు.