సోషల్ మీడియాల్లో వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదనడానికి ఇది నిదర్శనం. ట్విటర్లో ప్రయాణ వివరాల గురించి పోస్ట్ చేసి ఓ మహిళ రూ.64వేలను పోగొట్టుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఈ నెల 14న భుజ్ ప్రాంతానికి వెళ్లడానికి 3 ట్రైన్ టికెట్లను బుక్ చేసింది. సీట్లన్నీ నిండిపోవడంతో ఆమెకు ఆర్ఏసీ(రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సలేషన్) టికెట్ లభించింది. ఈ ప్రయాణాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆమె ట్విటర్ ఖాతాలో IRCTCని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు ఓ లింకుని పంపి వివరాలు పొందుపర్చాలని, రూ.2 కడితే టికెట్ పక్కా అవుతుందని చెప్పి నమ్మించారు. రూ.64వేలను లూటీ చేయడంతో మహిళ కంగుతింది.