శాకుంతలం సినిమా ట్రైలర్ విడుదల ఈవెంట్‌కి సమంత హాజరై అభిమానులకు ఊరట కలిగించారు. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నాక తొలిసారిగా ఆమె కెమెరా ముందుకొచ్చారు. దీంతో సమంత అందం కాస్త తగ్గిందంటూ సోషల్ మీడియాల్లో కొన్ని పోస్టులు అవతరించాయి. విడాకుల నుంచి కోలుకున్నాక మయోసైటిస్ వ్యాధి సమంతను మరింత బలహీనపరిచింది అంటూ జాలి చూపిస్తూ అందులో రాసుకొచ్చారు. అయితే, వీటికి సమంత గట్టిగా బదులిచ్చింది. ‘నా లాగా మీకు కూడా కొన్ని నెలల పాటు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. ఏదైతేనేం.. మీకు మరింత అందం ఒనగూరాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చింది.
-
Courtesy Twitter:Samantha -
Courtesy Twitter:Samantha