AP: విశాఖపట్నంలో సీఎం జగన్ వ్యతిరేక పోస్టర్లు కలకలం సృష్టించాయి. ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ పలు చోట్ల ‘జన జాగరణ సమితి’ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘అమరావతి రాజధానిని నిర్మించండి’ అంటూ పోస్టర్లలో రాసి ఉంది. దీంతో వైసీపీ శ్రేణులు ఈ పోస్టర్లను తొలగించాయి. ఆంధ్రా యూనివర్సిటీ గేటు ఎదుట కూడా ఇలాంటి పోస్టర్ ఏర్పాటు చేయడంతో వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మద్దెలపాలెం, జగదాంబ, అశిల్ మెట్ట, సిరిపురం కూడళ్లలోనూ ఈ పోస్టర్లు వెలిశాయి.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్