బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నిజాం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను ఘనంగా సత్కరించారు. జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. జనవరి 26లోపు నియామకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆర్థిక సహకారం కూడా అందించాలన్నారు.