అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ వాయిదా వేస్తున్నట్లు ఏపీ పోలీస్ నియామక మండలి తెలిపింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కాగా మార్చి 14 నుంచి పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ జరగాల్సి ఉంది. ఇప్పటికే హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ క్రమంలో ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. కాగా ప్రిలిమ్స్‌లో 95,209 మంది అర్హత సాధించారు. ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు.