హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. అధికార మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 68 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 35 స్థానాల్లో గెలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ(35) మార్కును చేరుకోవడంతో కాంగ్రెస్ విజయం ఖరారైంది. మరో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు, అధికారాన్ని నిలబెట్టుకోవడంలో బీజేపీ చతికిల పడింది. 18 సీట్లను గెల్చుకుని మరో 7 చోట్ల లీడ్లో ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవకకుండానే నిష్క్రమించింది. ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు.