• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ ‘హరి హర వీర మల్లు’ చిత్రానికి పెరుగుతున్న ఖర్చు?

    టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా షూటింగ్‌ని చాలా రోజుల క్రితం ప్రారంభించారు. కాని ఇంకా పూర్తి కాలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఈ మూవీ షూట్ రెండేళ్లపాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో పవన్ హరి హర వీర మల్లు తర్వాత ప్రకటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు పూర్తి చేశారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో పవన్ జాయిన్ అయ్యారు. కాని ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా షూట్ లేట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా మంది నటీనటుల డేట్లు అందుబాటులో లేకపోవడంతోనే ఆలస్యమవుతోందని పలువురు అంటున్నారు. ఈ మూవీ షూట్ కోసం భారీ సెట్లు నిర్మించబడ్డాయి. ఈ మూవీ నిర్మాత ఏఎమ్ రత్నం ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలోని అంతస్తు అద్దెను రెండేళ్లకు పైగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఖర్చు, బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. డైరెక్టర్ క్రిష్ మాత్రం జూలై నాటికి షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.