గోధుమపిండి సంక్షోభంతో ముప్పు తిప్పలు పడుతున్న పాకిస్థాన్‌కు మరో సమస్య ఎదురైంది. ఈ నెల 23న పాక్‌లోని ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్మిషన్లలో లోపాల వల్ల ఈ సమస్య తలెత్తినట్లు తెలిసింది. మరోవైపు, బలూచిస్థాన్‌లోని 22 జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో రోజురోజుకు పాక్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతుల కష్టాలు ఎదుర్కొంటోంది.