ప్రభాస్ అభిమానులకు మరో బిగ్ న్యూస్. పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో ప్రభాస్-హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌లో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా చేయబోతోంది. సిద్దార్త్ ఆనంద్‌తో ఈ మెగా ప్రాజెక్టు ఓకే అయినట్లు మైత్రీ మేకర్స్ ఓ టాక్‌షోలో చెప్పారు. ‘వార్’ వంటి యాక్షన్ బ్లాక్‌బస్టర్ తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్… ప్రస్తుతం పఠాన్‌తో వస్తున్నాడు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి. ఇది హిట్ అయితే ప్రభాస్-హృతిక్ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కే అవకాశముంది.