ప్రభాస్ హిందీలో నటించిన ‘ఆదిపురుష్’ తర్వాత మరో భారీ బడ్జెట్ హిందీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. అయితే ప్రభాస్ రెండేళ్ల వరకు సలార్, ప్రాజెక్ట్ కే, సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాతే వీరిద్దరి కాంబినేషన్లో పాన్ఇండియా సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. అయితే ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి.