పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారు. సెట్లో సింగీతం శ్రీనివాస్ రావుతో కలిసి దిగిన ఫొటోను చిత్రబృందం షేర్ చేసింది. లెజెండరీ దర్శకుడు తమ సెట్‌కు వచ్చారని పేర్కొంది. చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవిస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. సినిమా వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండటంతో విడుదలకు సమయం పడుతుంది.
ప్రాజెక్ట్ K సెట్స్‌లో ప్రభాస్

Screengrab Twitter:shreyasgroup